గుంటూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు అలర్ట్..మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే రూ.1000 ఫైన్

గుంటూరులో క‌రోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో లాక్‌డౌన్‌ మరింత స్ట్రిక్ట్ గా అమ‌లు చెయ్యాల‌ని అధికారులు భావిస్తున్నారు. కోవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా.. నిబంధనలు మ‌రింత‌ కఠినత‌రం చెయ్యాల‌ని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. వీటిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ప్లేసెస్ లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని అధికారులు ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. ఎవ‌రైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 1000 ఫైన్ వేస్తామ‌ని కలెక్టర్‌ వెల్లడించారు. నిత్యావ‌సరాలు, వెజిట‌బుల్స్ […]

గుంటూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు అలర్ట్..మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే రూ.1000 ఫైన్

Updated on: Apr 09, 2020 | 10:15 PM

గుంటూరులో క‌రోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో లాక్‌డౌన్‌ మరింత స్ట్రిక్ట్ గా అమ‌లు చెయ్యాల‌ని అధికారులు భావిస్తున్నారు. కోవిడ్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా.. నిబంధనలు మ‌రింత‌ కఠినత‌రం చెయ్యాల‌ని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. వీటిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ప్లేసెస్ లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని అధికారులు ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు. ఎవ‌రైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే రూ. 1000 ఫైన్ వేస్తామ‌ని కలెక్టర్‌ వెల్లడించారు. నిత్యావ‌సరాలు, వెజిట‌బుల్స్ కొనుగోలు చేసేందుకు ఒక్కరే రావాలని సూచించారు. గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులు ఉదయం 10 గంటలలోపు ఆఫీసుల‌కు చేరుకోవాలని.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు రహదార్లపైకి ఉద్యోగులను అనుమతించేది లేద‌ని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్ వెల్ల‌డించారు.