వాట్సాప్ ఉపయోగించే వినియోగదారులకు కొత్త ఫీచర్లను ఎప్పటిప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది ఆ సంస్థ. యూజర్ల చాటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనే ఫీచర్లను వినియోగంలోకి తీసుకొచ్చింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను వినియోగదారుల ముందుకు తీసుకు రానుంది వాట్సాప్. ఈ ఫీచర్‌తో మరింత హ్యాపీగా ఛాటింగ్ చేసుకోవచ్చు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా? ఇప్పటివరకూ మనకు వాట్సాప్ బాక్సులో నోటిఫికేషన్లు మ్యూట్ చేయడానికి లిమిటెడ్ పిరియడ్ మాత్రమే కనిపించేది. కానీ ఇకపై అలా కాదు.. శాశ్వతంగా మ్యూట్‌లో పెట్టే ఆప్షన్ అందుబాటులోకి రాబోతుంది.
సాధారణంగా మనకు అవసరం లేకపోయినా కొన్ని గ్రూపులు వాట్సాప్‌లో ఎప్పుడూ మోగుతూ ఉంటాయి. ఒక్కోసారి గాఢ నిద్రలో ఉన్నా కూడా అవి టింగ్.. టింగ్ అంటూ మోగుతూ నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. దీంతో వెంటనే మనం వాటిని మ్యూట్‌లో పెట్టేస్తూంటాయి. అది కూడా శాశ్వతంగా కాకుండా 8 hours, 1 Week లేదా 1 Year అనే తాత్కాలిక సమయాన్ని మాత్రమే చూపించేవి. వాటిలో ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ గడువు ముగిసిన తరువాత మళ్లీ వాట్సాప్‌లో నోటిఫికేషన్లు వస్తూంటాయి.
ఇకపై అలాంటి చికాకులు తలెత్తకుండా గ్రూపు నోటిఫికేషన్లు శాశ్వతంగా మ్యూట్ చేసే ఆప్షన్ వచ్చేస్తుంది. దీనికి సంబంధించి ఆధారాలను ఇప్పుడు సీరియల్ లీకర్ WABetaInfo కనుగొంది. ఇకపై మనకు అనవసరమైన గ్రూపుల నోటిఫికేషన్లను 1 Yearకి బదులుగా ‘Always’ ఆప్షన్‌ను యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నోటిఫికేషన్లను శాశ్వతంగా మ్యూట్ చేసే ఆప్షన్ లేకపోవడంతో చాలా మంది గ్రూపుల నుంచి లెఫ్ట్ అయిపోతారు. కానీ ఇకపై అలా చేయనవసరం లేకుండా ‘Always’ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. త్వరలోనే ఈ కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌కి సంబంధించి మరికొన్ని పనులు జరుగుతున్నాయి.
Read More:
కరోనా టెర్రర్ః ప్రపంచ వ్యాప్తంగా కోటి 70 లక్షలకు చేరుకున్న కోవిడ్ కేసులు..