తెలంగాణ జైళ్ల శాఖ‌లో క‌రోనా క‌ల‌కలం.. ఏకంగా 18 కేసులు..

తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. మొద‌టి సారిగా ఏకంగా ఒకేసారి 18 కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో ఇప్ప‌టికే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య..

తెలంగాణ జైళ్ల శాఖ‌లో క‌రోనా క‌ల‌కలం.. ఏకంగా 18 కేసులు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 30, 2020 | 11:32 AM

తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. మొద‌టి సారిగా ఏకంగా ఒకేసారి 18 కేసులు న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో ఇప్ప‌టికే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 60 వేలు దాటేసింది. అలాగే 505 మంది మృతి చెందారు. ఇక ఈ క‌రోనా మ‌హ‌మ్మారి ఊసెత్తితేనే జ‌నాలు హ‌డ‌లెత్తిపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, క్రీడాకారులు, పోలీసులు, వైద్యులు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు జైళ్ల‌లో కూడా కోవిడ్ క‌ల‌క‌లం రేపింది. తాజాగా వరంగల్ సెంట్రల్ జైల్లో పనిచేస్తున్న 18 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. జైల్లో ప‌ని చేస్తున్న 18 మంది సిబ్బందికి కోవిడ్ సోకిన‌ట్టు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ప్ర‌స్తుతం వీరు హోమ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు.

కాగా ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల్లో 1811 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 60,717కు చేరింది. 13 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 505కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 821 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 44, 572కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 15,460 యాక్టివ్ కేసులు ఉన్నాయి.