ఎవరినీ వదిలిపెట్టేది లేదు: సైబరాబాద్ పోలీస్ కమీషనర్

|

Mar 04, 2019 | 4:08 PM

హైదరాబాద్: ఐటీ గ్రిడ్ సంస్థపై జరుగుతున్న విచారణకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. డేటా దుర్వినియోగానికి సంబంధించి ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. సెన్సిటీవ్ డేటాను పబ్లిక్‌లో పెట్టాల్సిన అవసరం లేదని, ఏ అధికారంతో అలా చేస్తారని ఆయన అన్నారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, నేరాన్ని నిరూపించగలమని తెలిపారు. విచారణ కొనసాగుతోందని, మా మీద ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. అంతా చట్ట ప్రకారమే […]

ఎవరినీ వదిలిపెట్టేది లేదు: సైబరాబాద్ పోలీస్ కమీషనర్
Follow us on

హైదరాబాద్: ఐటీ గ్రిడ్ సంస్థపై జరుగుతున్న విచారణకు సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించారు. డేటా దుర్వినియోగానికి సంబంధించి ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. సెన్సిటీవ్ డేటాను పబ్లిక్‌లో పెట్టాల్సిన అవసరం లేదని, ఏ అధికారంతో అలా చేస్తారని ఆయన అన్నారు.

తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, నేరాన్ని నిరూపించగలమని తెలిపారు. విచారణ కొనసాగుతోందని, మా మీద ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. అంతా చట్ట ప్రకారమే ముందుకు వెళుతున్నామని ఆయన చెప్పారు. నలుగురు ఉద్యోగులను విచారించామని, ట్యాబ్‌లు, సీపీయూలు, ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు.

డేటా దుర్వినియోగం గురించి ఫిర్యాదు చేసిన లోకేశ్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ వద్దకు ఏపీ పోలీసులు వెళ్లి సీఆర్పీసీ నోటీసు ఇచ్చారు. స్టేట్‌మెంట్ ఇవ్వమని అడిగారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి ఇన్‌స్పెక్టర్‌తో కలిసి వచ్చి లోకేశ్ రెడ్డిని బెదిరించాల్సిన అవసరం ఏమిటని సజ్జనార్ ప్రశ్నించారు. ఇందుకు ఆ పోలీసులపై 447, 506 సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగిందని తెలిపారు.