#Lockdown లాక్‌డౌన్ నేపథ్యంలో జలమండలి సంచలన నిర్ణయం

|

Mar 28, 2020 | 7:33 PM

లాక్‌డౌన్ నేపథ్యంలో జనం ఇల్లు కదలలేని పరిస్జితిలో వుండగా హైదరాబాద్ జలమండలి సంచలన నిర్ణయం తీసుకుంది.

#Lockdown లాక్‌డౌన్ నేపథ్యంలో జలమండలి సంచలన నిర్ణయం
Follow us on

Water board sensational decision during lock-down days: లాక్‌డౌన్ నేపథ్యంలో జనం ఇల్లు కదలలేని పరిస్జితిలో వుండగా హైదరాబాద్ జలమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. అందరూ ఇళ్ళలో వుంటే జల వినియోగం పెరుగుతోంది… తద్వారా నీటి కోసం సమస్యలు కూడా రెట్టింపతాయి. అందుకే జలమండలి తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

జల మండలి బోర్డు దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన డయల్ యువర్ ఎండీ కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మారెడ్ పల్లి, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, కొండాపూర్, చిలకలగూడ, బాచుపల్లి, కాచిగూడ, తలాబ్ కట్ట, నాచారం, గోషామహల్, మాదాపూర్ తదితర ప్రాంతాల నుంచి అరకొర నీటి సరఫరాలో ప్రెషర్, బిల్లింగ్, సెవరెజీ, రెవెన్యూలకు సంబంధించిన 24 ఫిర్యాదులను డయల్ యువర్ ఎండీ కార్యక్రమంలో స్వీకరించారు. జనరల్ మేనేజర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

జలమండలి ఎండి జిఎంలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జలమండలి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్క మేనేజర్ ప్రతి రోజు కింది స్థాయి సిబ్బంది ఆరోగ్య విషయాలు, యోగక్షేమాలు తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతి కార్యాలయంలో సోడియం హైపోక్లోరైట్ రసాయనం చెల్లించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి శానిటైజర్, మాస్కులు వాడేలా చర్యలు తీసుకోవాలని ఎండి తెలిపారు. వీటిని అందరికి అందుబాటులో ఉంచాలన్నారు.

అత్యవసరంగా స్పందించేందుకు నాలుగు టాస్క్ ఫోర్స్ బృందాలను ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇందులో 100 మంది లైన్ మెన్లు, సేవరేజ్ సిబ్బంది, 1 జీఎం, ఇద్దరు డిజిఎంలు, నలుగురు మేనేజర్లు, ఒక ఎస్సై, పోలీస్ సిబ్బంది ఉండాలని సూచించారు. నగరంలో ఎక్కడ అత్యవసర మంచినీటి, సేవరేజ్ సమస్యలు ఏర్పడితే వెంటనే ఈ బృందాలు వాటిని పరిష్కరిస్తారని ఎండి తెలిపారు.