బ్రేకింగ్: నలుగురి ప్రాణాలు తీసిన లాక్ డౌన్.. !

| Edited By: Ram Naramaneni

Oct 18, 2020 | 9:32 PM

వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. బతుకుపై భారంతో ఓ చిన్నారితో సహా నలుగురు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గ్రామంతో ఒక్కసారిగా కలకలం రేపింది. గీసుగొండ మండలం గొర్రెకుంటలో బీహార్ కి చెందిన నలుగురు వలస కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. కోల్డ్ స్టోరేజ్‌కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడుతో పాటు చిన్నారి ఉన్నారు. బతుకు దెరువు కోసం వరంగల్ శివారులోని […]

బ్రేకింగ్: నలుగురి ప్రాణాలు తీసిన లాక్ డౌన్.. !
Follow us on

వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. బతుకుపై భారంతో ఓ చిన్నారితో సహా నలుగురు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో గ్రామంతో ఒక్కసారిగా కలకలం రేపింది.
గీసుగొండ మండలం గొర్రెకుంటలో బీహార్ కి చెందిన నలుగురు వలస కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. కోల్డ్ స్టోరేజ్‌కు ఎదురుగా ఉన్న బావిలోకి దూకి చిన్నారితో సహా నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడుతో పాటు చిన్నారి ఉన్నారు. బతుకు దెరువు కోసం వరంగల్ శివారులోని గొర్రెకుంట గ్రామానికి వచ్చిన ఈ బిహార్‌ వలసకూలీలు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. బతుకు దెరువు కోసం ఇరవై ఏండ్ల క్రితం వరంగల్ కు వలస వచ్చి గోనె సంచుల పరిశ్రమలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కొల్పోయారు. సొంతూరికి వెళ్లలేక.. ఉన్న ఊరిలో ఉండలేక ఆర్థికంగా చితికిపోయారు. రోజు రోజుకి పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో చేసేదీ లేక బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి కేసు దర్యాప్తు చేపట్టారు