పెళ్లి చేసుకోవడానికి కొత్త రూల్స్ పెట్టిన కేంద్రం..!

| Edited By:

Feb 01, 2020 | 3:06 PM

మా పాపకి 18 ఏళ్లు నిండాయి. ఇంకేంటి.. పెళ్లీడుకొచ్చింది.. వెంటనే పెళ్లి చేయాల్సిందే. ఇది సగటు తల్లిదండ్రుల ఆలోచన. ఇక ఇలా ఆలోచించే తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై అమ్మాయిలకు ఎప్పుడు వివాహం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నట్లు తెల్పారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని […]

పెళ్లి చేసుకోవడానికి కొత్త రూల్స్ పెట్టిన కేంద్రం..!
Follow us on

మా పాపకి 18 ఏళ్లు నిండాయి. ఇంకేంటి.. పెళ్లీడుకొచ్చింది.. వెంటనే పెళ్లి చేయాల్సిందే. ఇది సగటు తల్లిదండ్రుల ఆలోచన. ఇక ఇలా ఆలోచించే తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై అమ్మాయిలకు ఎప్పుడు వివాహం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకున్నట్లు తెల్పారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మహిళా, శిశు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ముఖ్యంగా తాము తీసుకొచ్చిన బేటీ బచావ్‌, బేటీ పడావ్‌ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని తెలిపారు. మహిళా,శిశు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ .28,600 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

ఇక ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం అడ్మిషన్ల విషయంలో… అబ్బాయిల కన్నా.. అమ్మాయిలదే నమోదు ఎక్కువగా ఉందన్నారు. అలాగే పౌష్టికాహారం, ప్రధానంగా గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్యం కోసం భారీ నిధులను కేటాయించారు. ఈ క్రమంలో అమ్మాయిల వివాహ విషయంలో కీలక అంశాన్ని ప్రతిపాదించారు. దేశంలో మహిళ వివాహం చేసుకోవడానికి.. కనీన వయస్సు ప్రస్తుం 18 ఏళ్లు ఉందన్నారు. ఇప్పుడు ఆ వయస్సును కాస్త పెంచాలన్న ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. అయితే.. దీనిపై సమగ్రమైన అధ్యయనం జరగాలన్నారు. అందుకు ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో ఆరునెలల్లో ఈ టాస్క్ ఫోర్స్ నివేదికలను అందించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.