Corona Effect అమెరికాలో ఇద్దరు భారతీయులు మృతి

రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలను బలిగొంటూనే వుంది. అమెరికాలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా.. తాజాగా ఇద్దరు భారతీయుల ఉసురు తీసింది.

Corona Effect అమెరికాలో ఇద్దరు భారతీయులు మృతి

Updated on: Apr 01, 2020 | 12:40 PM

Two Indians died with corona virus in America: రోజురోజుకూ శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ వేలాది మంది ప్రాణాలను బలిగొంటూనే వుంది. అమెరికాలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా.. తాజాగా ఇద్దరు భారతీయుల ఉసురు తీసింది. ఇరాన్, ఇటలీ, స్పెయిన్ దేశాలలో ఒక్కరు చొప్పున ముగ్గురు భారతీయులను బలిగొన్న కరోనా.. బుధవారం మరో ఇద్దరు భారతీయులను అమెరికాలో కబళించింది.

కరోనా వైరస్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో ఒకరు, న్యూజెర్సీలో మరొకరు మృత్యువాత పడ్డారు. కేరళకు చెందిన 43 ఏళ్ల థామస్ డేవిడ్ న్యూయార్క్‌లో మృతి చెందగా.. అదే కేరళలోని ఎర్నాకులానికి చెందిన 85 ఏళ్ల కుంజమ్మ శామ్యూల్ న్యూజెర్సీలో మృత్యువాత పడ్డారు. దాంతో విదేశాలలో కరోనా తాకిడితో మృతి చెందిన వారి సంఖ్య అయిదుకు చేరింది.

గతంలో స్పెయిన్‌లో తమిళనాడుకు చెందిన వ్యక్తి చనిపోగా.. ఇరాన్‌లో ఒకరు, ఇటలీలో మరొకరు గతంలో మృతి చెందారు. తాజాగా అమెరికాలో ఇద్దరు భారతీయులను కరోనా బలిగొనడంతో… మొత్తం సంఖ్య అయిదుకు చేరింది.