బ్రేకింగ్ : 8వ రోజు కు చేరుకున్న ఆర్టీసీ సమ్మె.. రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు

| Edited By:

Oct 12, 2019 | 6:47 PM

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారానికి 8వ రోజుకు చేరింది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా మౌన దీక్ష చేపట్టారు.  తమ నిరసన తెలిపేందుకు హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌కు  పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వీరంతా అక్కడున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగారు. ఎంజీబీఎస్ పరిసరాలు పూర్తిగా పోలీసులు మోహరించడంతో .. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు బస్ భవన్ […]

బ్రేకింగ్ : 8వ రోజు కు చేరుకున్న ఆర్టీసీ సమ్మె.. రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు
Follow us on

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారానికి 8వ రోజుకు చేరింది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా మౌన దీక్ష చేపట్టారు.  తమ నిరసన తెలిపేందుకు హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌కు  పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. వీరంతా అక్కడున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మౌన దీక్షకు దిగారు. ఎంజీబీఎస్ పరిసరాలు పూర్తిగా పోలీసులు మోహరించడంతో .. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు బస్ భవన్ వద్ద కూడా నిరసన తెలుపుతున్నారు.ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు టీఎస్ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలిచాయి.  ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్తు  కార్యాచరణపై ఇవాళ మధ్యాహ్నం మరోసారి అఖిలపక్ష సమావేశం కూడా జరగనుంది. దీనిలో సమ్మెను ఏ విధంగా కొనసాగిచాలనే దానిపై చర్చంచనున్నారు.