సింగరేణి ఎమ్మెల్యేల చింత.. తీర్చేనా కెసీఆర్?

|

Dec 03, 2019 | 4:55 PM

ఆర్టీసీ సమ్మె సింగరేణికి తలనొప్పిగా మారిందా? ఆర్టీసీ కార్మిక సంఘాల వల్లే సంస్థకు, కార్మికులకు అన్యాయం జరిగిందని కేసీఆర్‌ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇదే వాదనను సింగరేణి కార్మిక సంఘాలకు వర్తింప చేస్తే తమ పరిస్థితి ఏంటని సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. త్వరలోనే సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటువైపు నిలబడాలో తేల్చుకోలేక నలిగిపోతున్నారట సింగరేణి ఏరియాతో టచ్ వున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు. ఆర్టీసీ కార్మికల సమ్మె మొదలైన నాటి […]

సింగరేణి ఎమ్మెల్యేల చింత.. తీర్చేనా కెసీఆర్?
Follow us on

ఆర్టీసీ సమ్మె సింగరేణికి తలనొప్పిగా మారిందా? ఆర్టీసీ కార్మిక సంఘాల వల్లే సంస్థకు, కార్మికులకు అన్యాయం జరిగిందని కేసీఆర్‌ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఇదే వాదనను సింగరేణి కార్మిక సంఘాలకు వర్తింప చేస్తే తమ పరిస్థితి ఏంటని సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. త్వరలోనే సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎటువైపు నిలబడాలో తేల్చుకోలేక నలిగిపోతున్నారట సింగరేణి ఏరియాతో టచ్ వున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలు.

ఆర్టీసీ కార్మికల సమ్మె మొదలైన నాటి నుంచి కార్మిక సంఘాలపై కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారు. సంఘాలే కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని పలుమార్లు ప్రకటించిన సిఎం చివరకు ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెక్‌ పెట్టారు. దాంతో మిగతా కార్మిక సంఘాల్లో టెన్షన్‌ మొదలైంది. అయితే కార్మిక సంఘాలు లేకుండా చేయడం సాధ్యం కాదని, సిఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని కార్మిక నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు. వీరికి మద్దతుగా మాజీ హోం మంత్రి , టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి కూడా సంఘాలకు మద్దతుగా ప్రకటనలు చేయడంతో ఇప్పుడు సింగరేణి పరిధిలో ఉన్న గులాబీ ప్రజాప్రతినిధులకు గుబులు పట్టుకుంది.

కొద్ది రోజుల్లో సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలున్నాయి.. దీంతో ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు టెన్షన్‌ పట్టుకుంది. ఒకవైపు కార్మిక సంఘాల పేరు వింటేనే సిఎం ఒంటికాలిపై లేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ నిర్ణయంపై కార్మికసంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో తాము ఎవరివైపు నిలబడాలో తెలీక సతమతమవుతున్నారు.

ఇప్పుడు కార్మికులను కాదని సిఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటనే బెంగపట్టుకుందట ఆ ఎమ్మెల్యేలకి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్‌లోని రామగుండం, ఆదిలాబాద్‌లోని బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, వరంగల్‌లో భూపాలపల్లి, ఖమ్మంలోని కొత్తగూడెం , పాల్వంచ, ఇల్లందులతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు.. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడు ఈ అంశం తలనొప్పిగా మారింది.

రెండేళ్ల పాటు ఆర్టీసీ గుర్తింపు సంఘాల మనుగడకు బ్రేకులు వేసిన సిఎం, ఇప్పుడు మిగతా సంఘాల విషయం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం తమకు తిప్పలు తప్పవని పెద్దల దగ్గర మొరపెట్టుకుంటున్నారట కొందరు ఎమ్మెల్యేలు. ఆర్టీసీ సంఘాల విషయంలో కఠినంగా వ్యవహరించిన గులాబీ బాస్‌, ఇప్పుడు సింగరేణి విషయంలో ఏం చేస్తారో తెలియక సదరు నాయకులు బిక్కుబిక్కుమంటున్నారు.