అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ఆత్మహత్య.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
family members commit suicide : అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు. గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో ముగ్గురు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతి చెందిన వారిని రామకృష్ణ(43) అతని భార్య రాజేశ్వరి (38), అతని కుమారుడు దేవేంద్ర (14)గా గుర్తించారు. కాగా, స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండిః కోల్‌కతా రైల్వే ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య