బీచ్ ఒడ్డున వేల గుడ్లు..ఇక్కడే ఉంది అసలు మిస్టరీ..!

|

Nov 10, 2019 | 4:19 AM

మనసు స్వాంతన కోసం బీచ్‌కి వెళ్లడం చాలామందికి అలవాటు. అక్కడ సముద్రం అలలతో చేసే చప్పుళ్లు, వీచే గాలుల హోరు, రకరకాల జలచరాలు..కొత్త అనుభూతిని కలగజేస్తాయి. కానీ సరదాగా బీచ్‌కి వెళ్లిన ఓ ఫ్యామిలీ.. లైఫ్ టైం మూమెంట్‌ని.. ఫోన్‌తో పాటు మనసులోనూ నింపుకోని వచ్చారు. పై ఫోటోలో ఉన్నది బీచ్ అని అర్థమవుతోంది. కానీ ఆ గుడ్డన్నీ ఏ పక్షకి (లేదా) జంతుజాతికి  సంబంధించినవి..? ఇదే క్వచ్ఛన్ అక్కడికి వచ్చిన పర్యాటకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. వేల […]

బీచ్ ఒడ్డున వేల గుడ్లు..ఇక్కడే ఉంది అసలు మిస్టరీ..!
Follow us on

మనసు స్వాంతన కోసం బీచ్‌కి వెళ్లడం చాలామందికి అలవాటు. అక్కడ సముద్రం అలలతో చేసే చప్పుళ్లు, వీచే గాలుల హోరు, రకరకాల జలచరాలు..కొత్త అనుభూతిని కలగజేస్తాయి. కానీ సరదాగా బీచ్‌కి వెళ్లిన ఓ ఫ్యామిలీ.. లైఫ్ టైం మూమెంట్‌ని.. ఫోన్‌తో పాటు మనసులోనూ నింపుకోని వచ్చారు.

పై ఫోటోలో ఉన్నది బీచ్ అని అర్థమవుతోంది. కానీ ఆ గుడ్డన్నీ ఏ పక్షకి (లేదా) జంతుజాతికి  సంబంధించినవి..? ఇదే క్వచ్ఛన్ అక్కడికి వచ్చిన పర్యాటకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. వేల సంఖ్యలో గుడ్లు..వివిధ సైజుల్లో కనిపించడంతో వారు ఆశ్చర్యపోయారు. ఫిన్‌ల్యాండ్‌లోని మార్జనిమి బీచ్‌లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మీరు కూడా అవి ఏవో జీవికి సంబంధించిన గుడ్లని అనుకుంటున్నారా..? అయితే పప్పులో కాలేసినట్టే. అవి మాములు మంచు ముద్దలు మాత్రమే.

వివరాల్లోకి వెళ్తే…రిస్తో మట్టిలా అనే ఒక వ్యక్తి…వీకెండ్ కావడంతో ఫ్యామిలీని హైలుటో దీవిలోని మార్జనిమి బీచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉండగా..బీజ్ ఒడ్డున ఊహించనన్ని గుడ్లు దర్శనమివ్వడంతో ఒక్కసారే థ్రిల్ ఫీల్ అయ్యాడు. వెంటనే తన భార్యను తీసుకుని దగ్గరకు వెళ్లి చూడగా..అవి వివిధ షేప్స్‌లో ఉన్న మంచుముద్దలు మాత్రమే అని తెలుసుకున్నారు. కానీ అలా ఎందుకు తయారయ్యయే మాత్రం వారికి అర్థం కాలేదు. వెంటనే ఓ ఫోటో కొట్టి సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయడంతో..అది కాస్తా వైరల్ అయ్యింది. కాగా వాతావరణంలో మార్పులు మూలంగానే మంచు ఇలా వివిధ ఆకారాల్లో తయారవుతుందని నిపుణులు తెలిపారు.