AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారానికి మెరుగు పెడుతామని వచ్చి..పుస్తెల తాడుతో ఎస్కేప్

క్రైమ్ ఎలా జరుగుతుందో రోజూ చూస్తూనే ఉంటాం..మనవరకూ వచ్చినప్పుడు మాత్రం అందరిలానే మోసపోతాం. రైస్ పుల్లింగ్, ట్రెజర్ హంట్ వాటికి  ఆశపడి చిత్తయిపోతున్న వారు కోకొల్లలు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకొక మార్గంలో క్రైమ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా బంగారానికి మెరుగుపెడతామంటూ ఇంటికి వచ్చిన దుండగుడు మహిళ పుస్తెల తాడుతో ఎస్కేప్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే…మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ ఇద్దరు వ్యక్తులు కలియతిరిగారు. […]

బంగారానికి మెరుగు పెడుతామని వచ్చి..పుస్తెల తాడుతో ఎస్కేప్
Ram Naramaneni
|

Updated on: Nov 10, 2019 | 4:59 AM

Share

క్రైమ్ ఎలా జరుగుతుందో రోజూ చూస్తూనే ఉంటాం..మనవరకూ వచ్చినప్పుడు మాత్రం అందరిలానే మోసపోతాం. రైస్ పుల్లింగ్, ట్రెజర్ హంట్ వాటికి  ఆశపడి చిత్తయిపోతున్న వారు కోకొల్లలు. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకొక మార్గంలో క్రైమ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా బంగారానికి మెరుగుపెడతామంటూ ఇంటికి వచ్చిన దుండగుడు మహిళ పుస్తెల తాడుతో ఎస్కేప్ అయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే…మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని వెంకటగిరి గ్రామంలో మూడు రోజుల క్రితం ఓ ఇద్దరు వ్యక్తులు కలియతిరిగారు. బంగారం, వెండి, ఇత్తడి వస్తువులుకు మెరుగుపెడతామని చెప్పడంతో..అదే గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ..కాలి మెట్టెలను మెరుగుపెట్టించింది. అవి జిగేల్‌గా మెరిసిపోతుండటంతో..వెంటనే మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు కూడా ఇచ్చి మెరుగు పెట్టాల్సిందిగా కోరింది. దీంతో అప్పటి వరకు మాములుగా ఉన్న ఎదుటి వ్యక్తి..విక్రమార్కుడు సినిమాలో.. అత్తిలి చిరబరానందస్వామిగా మారిపోయాడు. మెరుగు పెట్టినట్టుగా యాక్ట్ చేసి..తాడుకి పసుపు పూసి..వెంటనే కడిగితేే సరిగ్గా షైన్ ఉండదని..ఒక గంట తర్వాత నీటితో కడగమని చెప్పి వెళ్లిపోయారు. ఆ మహిళ గంట తర్వాత దాన్ని కడగగా గొలుసు నలుపు రంగులోకి మారిపోయింది. టెన్షన్ పడ్డ ఆమె..బంగారం చేయించిన షాపు దగ్గరికి వెళ్లి అడగ్గా..అది బంగారం కాదు..గిల్టుదని తేల్చి చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు మహిళ లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ చేసింది. చూశారుగా ఆదమరిచారో జాదుగాళ్ల వలలో పడతారు. బి కేర్‌ఫుల్.

Follow Us
ఆయన మిస్సింగ్ మిస్టరీని విచారిస్తుండగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
ఆయన మిస్సింగ్ మిస్టరీని విచారిస్తుండగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
బీట్‌రూట్ - చియా సీడ్స్ నీరు కలిపి తీసుకుంటే బంపర్‌ బెనిఫిట్స్‌..
బీట్‌రూట్ - చియా సీడ్స్ నీరు కలిపి తీసుకుంటే బంపర్‌ బెనిఫిట్స్‌..
ఆ ప్రముఖ ఆలయంలో శ్రీముఖి ప్రత్యేక పూజలు.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఆ ప్రముఖ ఆలయంలో శ్రీముఖి ప్రత్యేక పూజలు.. బ్యూటిఫుల్ ఫొటోస్
16 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డ్ రిపీట్ చేసిన జడ్డూ.. అదేంటంటే?
16 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డ్ రిపీట్ చేసిన జడ్డూ.. అదేంటంటే?
నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు...
నెలకు రూ.10,000 సిప్‌ చేస్తే రూ.2 కోట్లు అయ్యేందుకు ఎన్నేళ్లు...
పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులే నవ్వులు
పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులే నవ్వులు
మోదీ మెచ్చిన మెలోడీ చాక్లెట్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?
మోదీ మెచ్చిన మెలోడీ చాక్లెట్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
మందుల షాపు బోర్డుపై దేశభక్తి.. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి!
‘హల్లల్లల్లో’ అంటూ అదరగొట్టేసింది.. ఎవరీ బ్యూటిఫుల్ సింగర్?
‘హల్లల్లల్లో’ అంటూ అదరగొట్టేసింది.. ఎవరీ బ్యూటిఫుల్ సింగర్?
కేవలం రూ.3.49 లక్షలకే అద్భుతమైన మైలేజీ ఇచ్చే మారుతి కారు..!
కేవలం రూ.3.49 లక్షలకే అద్భుతమైన మైలేజీ ఇచ్చే మారుతి కారు..!