వేర్పాటు వాదులపై కొరఢా ఝలిపించిన కేంద్రం

| Edited By:

Mar 02, 2019 | 4:58 PM

వేర్పాటు వాదులపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. జమైతే ఇస్లామీ సంస్థపై నిషేదం విధించింది. జమైతే ఇస్లామీ సంస్థ వేర్పాటు వాదంతో పాటు పాకిస్తాన్ అనుకూల విధానాన్ని ప్రోత్సహిస్తోండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జమైతే ఇస్లామి సంస్థకు చెందిన 52 కోట్ల రూపాయాలు, 70 బ్యాంకు ఎకౌంట్లు సీజ్ చేసింది. జమైతే ఇస్లామి సంస్థను నిషేధించడంతో శ్రీనగర్ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీడీపీ అధినేత మహబూబా ముఫ్తి నేతృత్వంలో శ్రీనగర్ లో ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. […]

వేర్పాటు వాదులపై కొరఢా ఝలిపించిన కేంద్రం
Follow us on

వేర్పాటు వాదులపై కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝలిపించింది. జమైతే ఇస్లామీ సంస్థపై నిషేదం విధించింది. జమైతే ఇస్లామీ సంస్థ వేర్పాటు వాదంతో పాటు పాకిస్తాన్ అనుకూల విధానాన్ని ప్రోత్సహిస్తోండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జమైతే ఇస్లామి సంస్థకు చెందిన 52 కోట్ల రూపాయాలు, 70 బ్యాంకు ఎకౌంట్లు సీజ్ చేసింది. జమైతే ఇస్లామి సంస్థను నిషేధించడంతో శ్రీనగర్ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీడీపీ అధినేత మహబూబా ముఫ్తి నేతృత్వంలో శ్రీనగర్ లో ఆందోళనా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వెంటనే నిషేధం ఎత్తివేయాలని పీడీపీ డిమాండ్ చేస్తోంది. దీంతో అక్కడ భారీగా అదనపు బలగాలు మోహరించాయి.