
అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రవాదులు మరోసారి గురిపెట్టారు. గత కొన్నేళ్లుగా యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు యత్నించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. అమర్‌నాథ్ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు అనేకసార్లు దాడులకు యత్నించారు. ఈ క్రమంలో యాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. భారతసైన్యం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే.. ఈ సారి కూడా ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రపై కన్నేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీ కూడా ధృవీకరించింది. అయితే అమర్‌నాథ్
యాత్ర ప్రశాంతంగా జరిగేలా చూడటానికి సైన్యం రెడీగా ఉందని 9 రాష్ట్రీయ రైఫిల్స్ సెక్టార్ కమాండర్, బ్రిగేడియర్ వి.ఎస్. థాకూర్ తెలిపారు. నేషనల్ హైవే 44పై మార్గ మధ్యలో ఏదో ఓ ప్రాంతంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేస్తున్నారని తమకు సమాచారం తెలిసిందని తెలిపారు.
There are inputs that they (terrorists) would try their best to target the yatra. NH-44 continues to be sensitive because that is the route that the yatris would take to go up to the north routes: Brigadier VS Thakur, Commander, 2 Sector https://t.co/gCuYVUzY1N
— ANI (@ANI) July 17, 2020