జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు లక్ష్యంగా పావులు కదిపారు. కుల్గాం జిల్లాలో పనిచేస్తున్న చెందిన రోజువారీ కూలీలు ఐదుగురిని అపహరించిన టెర్రరిస్టులు.. వారిని కిరాతకంగా చంపేశారు. మృతి చెందిన వారంతా పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. కాగా గత రెండు రోజుల్లో ఇది ఆరో ఉగ్రదాడి కావడం గమనార్హం. ఉగ్రవాదుల కోసం 18 భద్రతా బలగాలు మరియు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.