పదిరూపాయలకే బిర్యానీ అని ఆఫర్ పెడితే..

|

Oct 19, 2020 | 2:53 PM

తమిళనాడు సర్కార్‌కి బిర్యానీ అమ్మకాలు తలనొప్పిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా వాటిని బేఖాతరు చేస్తూ బంపర్ ఆఫర్ లతో బిర్యాని అమ్మకాలు చేపడుతున్నారు రెస్టారెంట్ దారులు. ఇవాళ విరుదునగర్ జిల్లాలో 10 రూపాయలకే బిర్యానీ అని చెప్పడంతో సుమారు 4 కిలోమీటర్ దూరానికి జనం క్యూలు కట్టారు. భారీ ఎత్తున రెస్టారెంట్ మీదకి ఎగబడ్డారు. ఇక, కరోనా నిబంధనలు సరేసరి. కనీసం మాస్క్ కూడా లేకుండా జనం ఎగబడడంతో పోలీసులు […]

పదిరూపాయలకే బిర్యానీ అని ఆఫర్ పెడితే..
Follow us on

తమిళనాడు సర్కార్‌కి బిర్యానీ అమ్మకాలు తలనొప్పిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా వాటిని బేఖాతరు చేస్తూ బంపర్ ఆఫర్ లతో బిర్యాని అమ్మకాలు చేపడుతున్నారు రెస్టారెంట్ దారులు. ఇవాళ విరుదునగర్ జిల్లాలో 10 రూపాయలకే బిర్యానీ అని చెప్పడంతో సుమారు 4 కిలోమీటర్ దూరానికి జనం క్యూలు కట్టారు. భారీ ఎత్తున రెస్టారెంట్ మీదకి ఎగబడ్డారు. ఇక, కరోనా నిబంధనలు సరేసరి. కనీసం మాస్క్ కూడా లేకుండా జనం ఎగబడడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు ఎంత వారించినా జనం వినకపోవడంతో లాఠీలకు పోలీసులు పని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని బిర్యానీ షాప్ యజమానికి జరిమానా విధించారు మున్సిపల్ అధికారులు. అదన్నమాట తమిళనాడు విషయం.