గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో కరోనా ఇప్పుడు వీరవిహారం చేస్తోంది. భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక షూటింగులకు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో బుల్లి తెర, వెండితెర చిత్రీకరణలకు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాఖ్యాత ఓంకార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న “ఇస్మార్ట్ జోడి” రీ స్టార్ట్ అయ్యింది.
కాగా గత కొద్ది రోజులుగా ఓంకార్ కు కోవిడ్-19 సోకిందనే వార్తలు సోషల్ మీడియా హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇవి పూర్తిగా సత్యదూరమైన వార్తలని..ఎంతమాత్రం నిజం లేదని ఓంకార్ కుటుంబ సభ్యులు తెలిపారు. కరోనా పరీక్షను ఓంకార్ చేయించుకున్నారని..రిపోర్ట్ నెగటీవ్ వచ్చిందని వెల్లడించారు.