కరోనాకు బలైన తెలుగు సీనియర్ నటుడు

|

Sep 24, 2020 | 9:27 AM

తెలుగుతెర సీనియర్ నటుడు కోసూరి వేణుగోపాల్ ఇకలేరు.  కరోనాతో బాధపడుతున్న వేణుగోపాల్ కు ఇటీవల నిమోనియా కూడా తోడైంది. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ తెల్లవారుజామున గుండెపోటుకు గురై ప్రాణాలొదిలారు. కాగా,  అనారోగ్య కారణాలతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో వేణుగోపాల్ కొన్ని రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ‘మర్యాద రామన్న’, ‘విక్రమార్కుడు’, ‘ఛలో’ సహా అనేక సినిమాల్లో నటించారు వేణుగోపాల్. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. […]

కరోనాకు బలైన తెలుగు సీనియర్ నటుడు
Follow us on

తెలుగుతెర సీనియర్ నటుడు కోసూరి వేణుగోపాల్ ఇకలేరు.  కరోనాతో బాధపడుతున్న వేణుగోపాల్ కు ఇటీవల నిమోనియా కూడా తోడైంది. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ తెల్లవారుజామున గుండెపోటుకు గురై ప్రాణాలొదిలారు. కాగా,  అనారోగ్య కారణాలతో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో వేణుగోపాల్ కొన్ని రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. ‘మర్యాద రామన్న’, ‘విక్రమార్కుడు’, ‘ఛలో’ సహా అనేక సినిమాల్లో నటించారు వేణుగోపాల్. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. నటన మీద మక్కువతో ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు వేణుగోపాల్. రాజమౌళి సినిమాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మర్యాద రామన్న’ సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్ర ఆయనకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగులో దాదాపు 30 సినిమాలకు పైగానే వేణుగోపాల్ నటించారు.