కొత్తగా వ్యవసాయ అధికారుల నియామకానికి అనుమతి

|

May 19, 2020 | 6:00 PM

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త వ్యవసాయ శాఖలో కొత్త నియమాకానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ విధానంలో భర్తీ ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఈవో పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సమగ్ర వ్యవసాయ విధానం […]

కొత్తగా వ్యవసాయ అధికారుల నియామకానికి అనుమతి
Follow us on

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త వ్యవసాయ శాఖలో కొత్త నియమాకానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 194 వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది ప్రభుత్వం. ఈ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ విధానంలో భర్తీ ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏఈవో పోస్టుల భర్తీకి అనుమతించిన సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

సమగ్ర వ్యవసాయ విధానం అమలు కోసం మిగిలిన 194 క్లస్టర్లలో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏఈవోల భర్తీకి ఆదేశాలు జారీ చేశామని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు . రెగ్యులర్‌ ప్రాతిపదికన అధికారులను నియమించే వరకు క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు రాకుండా వీరి సేవలు వినియోగించుకుంటామన్నారు.