తెలంగాణ వ్యవసాయంపై బీహార్ మంత్రి సూపర్ కామెంట్.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యం ఖాయం…

|

Sep 20, 2019 | 5:54 PM

తెలంగాణ వ్యవసాయ రంగంలో పురోగతిపై బీహార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం అధ్యయనం చేసింది. కెసిఆర్ విధానాలు దేశవ్యాప్తంగా చర్చనీయం అయిన నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణలో వ్యవసాయ పథకాలు బాగున్నాయని ప్రేమ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. విత్తన రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వరి, మొక్కజొన్న విత్తనాలు […]

తెలంగాణ వ్యవసాయంపై బీహార్ మంత్రి సూపర్ కామెంట్.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యం  ఖాయం...
Follow us on

తెలంగాణ వ్యవసాయ రంగంలో పురోగతిపై బీహార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందం అధ్యయనం చేసింది. కెసిఆర్ విధానాలు దేశవ్యాప్తంగా చర్చనీయం అయిన నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణలో వ్యవసాయ పథకాలు బాగున్నాయని ప్రేమ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. విత్తన రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వరి, మొక్కజొన్న విత్తనాలు దిగుమతి చేసుకుంటామని ప్రేమ్ కుమార్ చెప్పారు.

రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి : నిరంజన్ రెడ్డి

రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు తీసుకువచ్చాం. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు, రైతుబీమాతో రైతులకు భరోసా కల్పించాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందజేస్తున్నాం అని మంత్రి తెలిపారు.