వినియోగదారులకు అదిరిపోయే అప్‌డేట్‌ను తీసుకొచ్చింది వాట్సాప్. యూజర్ల చాటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక ఫీచర్లను వినియోగంలోకి తీసుకొచ్చింది. తాజాగా యూజర్ల చాటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని 138 కొత్త ఎమోజీలను తీసుకొచ్చేసింది వాట్సాప్. ఈ కొత్త అప్‌డేట్స్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.20.197.6 బీటాలోని తాజా మార్పులతో కొత్త ఎమోజీలను తీసుకొచ్చింది. ఎమోజీలు భావాలను, భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇవి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్నాయి. చాలా మంది వినియోగదారులు చాటింగ్‌కి బదులు ఈ ఎమోజీలను వాడుతున్నారు.
ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్లను విడుదల చేసిన కొద్ది రోజులకే వీటిని కూడా జోడించింది. సాధారణ స్టిక్కర్ ప్యాక్‌లతో పాటు యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లు ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఇవి ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటికి ఇవి కాస్త భిన్నంగా కనిపించబోతున్నాయి. మొదటిసారి చూసినప్పుడు తేడాను గమనించలేకపోవచ్చు. వీటిలో కొత్త రంగు టోన్లు, బట్టలు, హెయిర్ స్టైల్, స్కిన్ టోన్స్‌లలో తేడాలు ఉంటాయి.
కాగా దీన్ని వాట్సాప్ బీటా ట్రాకర్ డబ్ల్యూఏ బేటా ఇన్పో ఆండ్రాయిడ్ వాట్సాప్ వెర్షన్ 2.20.197.6 బీటాలో సరికొత్త ఎమోజీలను విడుదల చేసింది. అయితే మీరు గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌లోని తాజా వెర్షన్‌ని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా కొత్త మార్పులను గమనించవచ్చు.
Read More:
కరోనాతో పెద్దమ్మ తల్లి గుడిలో కొత్త ప్రయోగం… గొడుగులతో!
‘క్యాస్టింగ్ కౌచ్’పై నటి ప్రగతి సంచలన కామెంట్స్..
సీఎం జగన్‌కు చెన్నైవాసి అరుదైన కానుక.. బంగారు, వెండితో మసీదు!
‘ఆత్మ నిర్భర్ భారత్ లోగో’ తయారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!