సీఎం జగన్ కట్టడి చేయాలి : సోమిరెడ్డి

తెలుగుదేశం పార్టీ లౌకిక విధానం పై ఏర్పడిందని ఆపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్న మాటలు భయాందోళనకు దారితీస్తున్నాయని వ్యాఖ్యానించారు. హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని ముస్లిం, క్రిస్టియన్ పెద్దలు అంగీకరించరని ఆయన నెల్లూరులో చెప్పారు. తిరుమలలో ఎప్పుడో పెట్టిన ఆచారం డిక్లరేషన్ అని తెలిపిన సోమిరెడ్డి..  అధికారంలో ఉన్నాం కావున ఆలయ సంప్రదాయాలను మేము ధిక్కరిస్తాం అన్నట్టుగా వైసీపీ నేతలు వైఖరి ఉందని విమర్శించారు. మంత్రులు, […]

సీఎం జగన్ కట్టడి చేయాలి : సోమిరెడ్డి
Somireddy Sensational Comments On Kodela Death

Updated on: Sep 25, 2020 | 3:29 PM

తెలుగుదేశం పార్టీ లౌకిక విధానం పై ఏర్పడిందని ఆపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్న మాటలు భయాందోళనకు దారితీస్తున్నాయని వ్యాఖ్యానించారు. హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని ముస్లిం, క్రిస్టియన్ పెద్దలు అంగీకరించరని ఆయన నెల్లూరులో చెప్పారు. తిరుమలలో ఎప్పుడో పెట్టిన ఆచారం డిక్లరేషన్ అని తెలిపిన సోమిరెడ్డి..  అధికారంలో ఉన్నాం కావున ఆలయ సంప్రదాయాలను మేము ధిక్కరిస్తాం అన్నట్టుగా వైసీపీ నేతలు వైఖరి ఉందని విమర్శించారు. మంత్రులు, వైసీపీ నాయకులను కట్టడి చేసే బాధ్యత సీయం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలో అత్యధిక భక్తులు కలిగిన వెంకటేశ్వర స్వామి సంప్రదాయనికే జగన్మోహన్ రెడ్డి వలన భంగం వాటిల్లిందని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.