తమిళనాడులో 3.50 లక్షలకు చేరువగా కరోనా కేసులు

తమిళనాడులో అదే జోరు అదే తీరు.. కరోనా మహమ్మారి కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది.

తమిళనాడులో 3.50 లక్షలకు చేరువగా కరోనా కేసులు

Updated on: Aug 18, 2020 | 7:09 PM

తమిళనాడులో అదే జోరు అదే తీరు.. కరోనా మహమ్మారి కరాళనృత్యం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువైంది. గత కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో నిత్యం ఐదు వేలకు తక్కుంగా కాకుండా కరోనా కేసులు, వందకుపైగా మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,709 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 121 మంది కరోనా బారిన పడి ప్రాణాలొదిలారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,654కు చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 6,007కు చేరింది. కాగా, తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,95,794 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. అటు, ప్రస్తుతం 53,820 యాక్టివ్ కేసులతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.