హలాల్ నిషేధానికి సుప్రీం నో

|

Oct 12, 2020 | 6:41 PM

జంతువులు, పక్షులను హలాల్ విధానంలో అంతమొందించడాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిని దాదాపు...

హలాల్ నిషేధానికి సుప్రీం నో
Follow us on

Supreme Court rejected Halal ban: జంతువులు, పక్షులను హలాల్ విధానంలో అంతమొందించడాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిని దాదాపు చీవాట్లేసినంత పని చేసింది సుప్రీం కోర్టు. హలాల్‌ విధానాన్ని నిషేధించాలంటూ కోర్టుకెక్కడం దుర్మార్గపూరితంగా వుందని సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు.

దేశంలో హలాల్ విధానంలో జంతు హింసను నిరోధించాలని, హలాల్ విధానాన్ని నిషేధించాలని అఖండ్ భారత్ మోర్చా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. పిటిషనర్ ఉద్దేశాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

ప్రజల ఆహార విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోజాలవని స్పష్టం చేసిన జస్టిస్ కౌల్.. హలాల్ మాంసాన్ని తినేవారు, ఝట్కా మాంసాన్ని తినేవారు.. వారి వారి ఆసక్తి మేరకు నడుచుకుంటారని వ్యాఖ్యానించారు. హలాల్ నిషేధాన్ని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. హలాల్ తరహా జంతువులు, పక్షుల హననం చేసిన తర్వాత ఆ మాంసాన్ని వండుకుని తినే అలవాటు ముస్లిం వర్గాలలో వున్న విషయం తెలిసిందే. పలువురు హిందువులు కూడా హలాల్ మాంసాన్ని తినేందుకే మొగ్గు చూపుతున్న విషయం కూడా విధితమే.

Also read: వెంకయ్య ఆరోగ్యంపై కీలక ప్రకటన

Also read: హైదరాబాద్ ప్రజలకు 72 గంటల వార్నింగ్

Also read: ‘ఆ’ భవనాలను ఖాళీ చేయించండి: కేటీఆర్ ఆదేశం

Also read: కమలదళంలోకి ఖుష్బూ

Also read: ఉద్యోగులకు టీటీడీ బ్రహ్మోత్సవ కానుక