లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

|

Mar 06, 2019 | 4:30 PM

ముంబయి: భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా సద్దుమణగడంతో వరుసగా రెండో రోజు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు  లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 193.56 పాయింట్ల లాభంతో 36636.10 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 65.55 పాయింట్లు లాభపడి 11053.00 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.49గా నమోదైంది. బీఎస్‌ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ముఖ్యంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్లు 20శాతం లాభపడి రూ.161 వద్ద ముగిశాయి. ఎడ్విలెస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు కూడా 12శాతం లాభాన్ని నమోదు […]

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
Follow us on

ముంబయి: భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా సద్దుమణగడంతో వరుసగా రెండో రోజు బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు  లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 193.56 పాయింట్ల లాభంతో 36636.10 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 65.55 పాయింట్లు లాభపడి 11053.00 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.49గా నమోదైంది.

బీఎస్‌ఈ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ముఖ్యంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్లు 20శాతం లాభపడి రూ.161 వద్ద ముగిశాయి. ఎడ్విలెస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు కూడా 12శాతం లాభాన్ని నమోదు చేసి రూ.173 వద్ద స్థిరపడింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చల పరిణామాల నేపథ్యంలో ఆసియా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా బుధవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.