‘ఆ యోధులకు సహకరిద్దాం’.. ప్రజలకు సోనియా పిలుపు

| Edited By: Anil kumar poka

Apr 14, 2020 | 12:57 PM

దేశ ప్రజలు లాక్ డౌన్, సామాజిక దూరాన్ని పాటించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిఛ్చారు. మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి ముందు ఆమె ఓ వీడియో సందేశం ఇస్తూ..

ఆ యోధులకు సహకరిద్దాం.. ప్రజలకు సోనియా పిలుపు
Follow us on

దేశ ప్రజలు లాక్ డౌన్, సామాజిక దూరాన్ని పాటించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిఛ్చారు. మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి ముందు ఆమె ఓ వీడియో సందేశం ఇస్తూ.. తగినన్ని సేఫ్టీ కిట్లు వగైరా సాధనాలు లేనప్పటికీ…డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, వలంటీర్లు కరోనా రోగులకు సేవలందిస్తున్నారని,  అలాగే పోలీసు సిబ్బంది కూడా నిర్విరామంగా తమ విధుల్లో ఉంటున్నారని, ఈ యోధులందరికీ ప్రజలు కృతజ్ఞతలు తెలపాలని కోరారు. వీరికి  మనం పూర్తిగా సహకరిద్దాం అన్నారు. నిత్యావసరాలు ప్రజలకు అందేలా చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా సోనియా ప్రశంసించారు… వీరందరికీ మనం సహకరించకపోతే.. వారు తమ విధులను నిర్వహించలేరన్నారు. డాక్టర్లపై దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఇది సరికాదన్నారు. కరోనాపై వారు జరిపే పోరాటంలో వారికి మనం మనస్ఫూర్తిగా సహకరిద్దామని ఆమె పేర్కొన్నారు. ఈ పోరాటంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాలుపంచుకుంటారని, తాము ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా కరోనా మహమ్మారిని అణచివేసేందుకు కృషి చేస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారు.