ఏపీకి షాకిచ్చిన కృష్ణా రివర్ బోర్డు

కృష్ణా నదీ జలాల వినియోగం, భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఒకవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోరాట పంథాలో సాగుతుండగా.. కృష్ణా రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది.

ఏపీకి షాకిచ్చిన కృష్ణా రివర్ బోర్డు

Updated on: May 19, 2020 | 4:41 PM

Krishna river management board shocks andhra government: కృష్ణా నదీ జలాల వినియోగం, భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఒకవైపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు పోరాట పంథాలో సాగుతుండగా.. కృష్ణా రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చింది. పోతిరెడ్డిపాడు వద్ద రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుకునేందుకు ప్రణాళిక రచిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే కృష్ణా జలాలను అదనంగా డ్రా చేసుకుంటున్నారని, దానిని తక్షణం ఆపాలని కృష్ణా రివర్ బోర్డు తాఖీదు పంపింది. ఈ మేరకు ఏపీ ఇంజనీర్-ఇన్-చీఫ్‌కు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఛైర్మెన్ మంగళవారం లేఖ రాశారు.

Read full letter:   Lr to ENCs dt.19.05.2020

శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌ను డ్రా చేసుకునేందుకు ఉద్దేశించిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తాజాగా ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు పోరాట పంథాను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్మించిన పలు ప్రాజెక్టులపై ఏపీ ఒకేసారి కృష్ణా, గోదావరి రివర్ బోర్డులకు ఫిర్యాదు చేసింది. ఇంకోవైపు కృష్ణా నదిలో నీళ్ళు లేవంటూ.. గోదావరి జలాలను వాడుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా సూచించారు.

అయితే, రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్న తరునంలో కృష్ణా రివర్ బోర్డు ఏపీకి షాకిస్తూ సడన్‌గా లేఖ రాసింది. కేటాయించిన దానికంటే ఎక్కువగా కృష్ణా నదీ జలాలను వాడుకుంటున్నారంటూ ఏపీ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు లేఖ రాసింది. సాగర్ కుడి కాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి నుంచి ఎక్కువ నీటిని ఏపీ వాడుకుంటోందని, ఇకనైనా నీటి వాడకాన్ని నిలిపివేయాలని ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ శాఖకు మంగళవారం పంపిన లేఖలో కృష్ణా రివర్ బోర్డ్ ఛైర్మెన్ పేర్కొన్నారు.