గ్రేటర్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలివే.. పకడ్బందీ వ్యూహంతో ఈసీ రెడీ.. భారీగా బందోబస్తు ప్లాన్

|

Nov 25, 2020 | 6:59 PM

హైదరాబాద్ మహానగరంలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌కు రెడీ అవుతోంది. ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా...

గ్రేటర్ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలివే.. పకడ్బందీ వ్యూహంతో ఈసీ రెడీ.. భారీగా బందోబస్తు ప్లాన్
Follow us on

Sensitive areas in Greater Hyderabad: డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ జరగబోతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఏరియాలో మొత్తం 601 సమస్యాత్మక (సెన్సిటివ్) ప్రాంతాలున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. 601 సమస్యాత్మక ప్రాంతాల్లోని మొత్తం 1704 పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ పోలీసు బందోబస్తుకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైదరాబాద్ పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.

హైదరాబాద్ సిటీలో 601 సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లను ఈసీ గుర్తించింది. ఈ ప్రాంతాల పరిధిలోని 1704 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. వీటిలో 307 అత్యoత సమస్యాత్మక పోలింగ్ లొకేషన్లుగా అంఛనా వేస్తున్నారు. 1085 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఐడెంటిఫై చేశారు. సిటీ వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 1,167 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.

ఎన్నికల సందర్భంగా 3,744 వెపన్స్(ఆయుధాలు)ను పోలీస్ స్టేషన్‌లలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు డిపాజిట్ చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన 19 మంది నాయకులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో 1 కోటి 40 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 10 లక్షల రూపాయలు విలువ చేసే 80 గ్రాముల మత్తు పదార్థాలు సీజ్ చేసినట్లు తెలిపారు. 59 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ: సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.. ఆఖరు నిమిషంలో నిర్ణయం

ALSO READ: గ్రేటర్ ఎన్నికల బరిలో నేరచరితులు.. అత్యధికులు బీజేపీ అభ్యర్థులే