బ్రేకింగ్: సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.. ఆఖరు నిమిషంలో నిర్ణయం.. కారణం ఏంటంటే?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన హైదరాబాద్ పర్యటనను ఆఖరు నిమిషంలో రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి...

  • Rajesh Sharma
  • Publish Date - 5:30 pm, Wed, 25 November 20
బ్రేకింగ్: సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.. ఆఖరు నిమిషంలో నిర్ణయం.. కారణం ఏంటంటే?

CM Jagan cancels Hyderabad tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన హైదరాబాద్ పర్యటనను ఆఖరు నిమిషంలో రద్దు చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి జరగనున్న రెండు వివాహాలకు జగన్ హాజరు కావాల్సి వుండింది. అందుకు బుధవారం సాయంత్రం బయలుదేరి.. తిరిగి రాత్రి తొమ్మిదిన్నరకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. కానీ.. చివరి నిమిషంలో సీఎం తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

ముందుగా అనుకున్న దాని ప్రకారం ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే ఓ పారిశ్రామికవేత్త కుమార్తె వివాహానికి హాజరు కావాల్సి వుంది. ఆ తర్వాత ఓ ఇంటరాక్షన్‌లో పాల్గొని.. జగన్ సొంత దినపత్రిక సంపాదకుని ఇంట జరిగే మరో వివాహానికి హాజరైన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ-గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్ళేలా ప్లాన్ చేశారు. అయితే.. బంగాళాఖాతం మీదుగా దూసుకు వస్తున్న తుఫాను కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం వుండడంతో జగన్ తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో రద్దు చేసుకున్నట్లు సీఎంఓ తెలిపింది.

ALSO READ: గ్రేటర్ ఎన్నికల బరిలో నేరచరితులు.. అత్యధికులు బీజేపీ అభ్యర్థులే