పోలింగ్‌ కేంద్రం వద్ద గాల్లోకి కాల్పులు

ఉత్తరప్రదేశ్ : సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లోని కైరానాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. షామ్లీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో కొందరు వ్యక్తులు ఓటర్ గుర్తింపు కార్డులు లేకుండానే ప్రవేశించారు. అనంతరం ఓటు వేసేందుకు ప్రయత్నించారు. వీరిని పోలింగ్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపై దాడికి తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపి ఈ వ్యక్తులను చెదరగొట్టారు. దీంతో నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. #WATCH Security personnel fired shots […]

పోలింగ్‌ కేంద్రం వద్ద గాల్లోకి కాల్పులు

Edited By:

Updated on: Apr 11, 2019 | 7:29 PM

ఉత్తరప్రదేశ్ : సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ లోని కైరానాలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. షామ్లీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో కొందరు వ్యక్తులు ఓటర్ గుర్తింపు కార్డులు లేకుండానే ప్రవేశించారు. అనంతరం ఓటు వేసేందుకు ప్రయత్నించారు. వీరిని పోలింగ్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపై దాడికి తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపి ఈ వ్యక్తులను చెదరగొట్టారు. దీంతో నిందితులు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.