బాధిత మహిళ బయటపెట్టిన ఎస్బీ సీఐ చంద్రకుమార్ మరిన్ని బాగోతాలు

|

Sep 29, 2020 | 7:16 PM

ఎస్బీ సీఐ చంద్రకుమార్ అరాచకాలు మరిన్ని బయటపడుతున్నాయి. తన పట్ల లైంగిక వేధింపులు జరిపిన సిఐ చంద్రకుమార్ పై పోలీస్‌లు చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు.. ఇప్పడు మీడియాను ఆశ్రయించారు. పోలీస్ లకు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఏ విధమైన చర్యలు అతనిపై తీసుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ చంద్రకుమార్ బాగోతాలపై ఆమె తాజాగా పలు సాక్ష్యాలను ఆమె మీడియాకు విడుదల చేశారు. ఇలా ఉండగా, హైద‌రాబాద్ న‌గ‌ర నిఘా […]

బాధిత మహిళ బయటపెట్టిన ఎస్బీ సీఐ చంద్రకుమార్ మరిన్ని బాగోతాలు
Follow us on

ఎస్బీ సీఐ చంద్రకుమార్ అరాచకాలు మరిన్ని బయటపడుతున్నాయి. తన పట్ల లైంగిక వేధింపులు జరిపిన సిఐ చంద్రకుమార్ పై పోలీస్‌లు చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు.. ఇప్పడు మీడియాను ఆశ్రయించారు. పోలీస్ లకు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఏ విధమైన చర్యలు అతనిపై తీసుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ చంద్రకుమార్ బాగోతాలపై ఆమె తాజాగా పలు సాక్ష్యాలను ఆమె మీడియాకు విడుదల చేశారు.

ఇలా ఉండగా, హైద‌రాబాద్ న‌గ‌ర నిఘా విభాగ‌మైన స్పెష‌ల్ బ్రాంచ్ (ఎస్బీ)లో ఈస్ట్ జోన్ సీఐగా ప‌నిచేసే వాడు చంద్రకుమార్. వ‌న‌స్థ‌లిపురంలో ఉండే బాధిత మహిళ కొన్నేళ్ల క్రితం టెన్త్ క్లాస్ మార్కులిస్టులు పోవ‌డంతో… ఫిర్యాదు చేసేందుకు మిర్యాల‌గూడ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు. అప్ప‌ట్లో అక్క‌డ ఎస్ఐగా ప‌నిచేస్తున్న చంద్ర‌కుమార్‌కు బాధితురాలితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. బాధితురాలి స‌ర్టిఫికెట్ల‌ను రిక‌వ‌రీ చేసి ఇచ్చాడు. ఇదే అలుసుగా, సాకుగా తీసుకున్న చంద్ర‌కుమార్‌… అప్పుడ‌ప్పుడు బాధితురాలికి ఫోన్లు చేయ‌డంతో పాటు మెసేజ్‌లో పెట్టేవాడు. మరింత దిగజారి నగ్నంగా ఉన్న వీడియోలు పంపి సీఐ వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై వనస్థలిపురం పీఎస్ లో సీఐ చంద్రకుమార్ పై కేసు నమోదైనప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు లేవని బాధిత మహిళ వాపోతోంది.