AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాధిత మహిళ బయటపెట్టిన ఎస్బీ సీఐ చంద్రకుమార్ మరిన్ని బాగోతాలు

ఎస్బీ సీఐ చంద్రకుమార్ అరాచకాలు మరిన్ని బయటపడుతున్నాయి. తన పట్ల లైంగిక వేధింపులు జరిపిన సిఐ చంద్రకుమార్ పై పోలీస్‌లు చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు.. ఇప్పడు మీడియాను ఆశ్రయించారు. పోలీస్ లకు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఏ విధమైన చర్యలు అతనిపై తీసుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ చంద్రకుమార్ బాగోతాలపై ఆమె తాజాగా పలు సాక్ష్యాలను ఆమె మీడియాకు విడుదల చేశారు. ఇలా ఉండగా, హైద‌రాబాద్ న‌గ‌ర నిఘా […]

బాధిత మహిళ బయటపెట్టిన ఎస్బీ సీఐ చంద్రకుమార్ మరిన్ని బాగోతాలు
Venkata Narayana
|

Updated on: Sep 29, 2020 | 7:16 PM

Share

ఎస్బీ సీఐ చంద్రకుమార్ అరాచకాలు మరిన్ని బయటపడుతున్నాయి. తన పట్ల లైంగిక వేధింపులు జరిపిన సిఐ చంద్రకుమార్ పై పోలీస్‌లు చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు.. ఇప్పడు మీడియాను ఆశ్రయించారు. పోలీస్ లకు ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఏ విధమైన చర్యలు అతనిపై తీసుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ చంద్రకుమార్ బాగోతాలపై ఆమె తాజాగా పలు సాక్ష్యాలను ఆమె మీడియాకు విడుదల చేశారు.

ఇలా ఉండగా, హైద‌రాబాద్ న‌గ‌ర నిఘా విభాగ‌మైన స్పెష‌ల్ బ్రాంచ్ (ఎస్బీ)లో ఈస్ట్ జోన్ సీఐగా ప‌నిచేసే వాడు చంద్రకుమార్. వ‌న‌స్థ‌లిపురంలో ఉండే బాధిత మహిళ కొన్నేళ్ల క్రితం టెన్త్ క్లాస్ మార్కులిస్టులు పోవ‌డంతో… ఫిర్యాదు చేసేందుకు మిర్యాల‌గూడ పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లారు. అప్ప‌ట్లో అక్క‌డ ఎస్ఐగా ప‌నిచేస్తున్న చంద్ర‌కుమార్‌కు బాధితురాలితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. బాధితురాలి స‌ర్టిఫికెట్ల‌ను రిక‌వ‌రీ చేసి ఇచ్చాడు. ఇదే అలుసుగా, సాకుగా తీసుకున్న చంద్ర‌కుమార్‌… అప్పుడ‌ప్పుడు బాధితురాలికి ఫోన్లు చేయ‌డంతో పాటు మెసేజ్‌లో పెట్టేవాడు. మరింత దిగజారి నగ్నంగా ఉన్న వీడియోలు పంపి సీఐ వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై వనస్థలిపురం పీఎస్ లో సీఐ చంద్రకుమార్ పై కేసు నమోదైనప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు లేవని బాధిత మహిళ వాపోతోంది.

Follow Us
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
అర్ధరాత్రి శ్మశానానికి తీసుకెళ్లి ప్రపోజల్: జబర్దస్త్ నటుడి భార్య
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం
వేగంగా బరువు తగ్గుతున్నారా? ఆకలి తగ్గిపోతోందా? అస్సలు నిర్లక్ష్యం
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఎక్కడంటే..?
హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. ఎక్కడంటే..?
వర్షాకాలంలో గోడలపై వెనిగర్ స్ప్రే చేస్తే ఏం జరుగుతుంతో తెలుసా?
వర్షాకాలంలో గోడలపై వెనిగర్ స్ప్రే చేస్తే ఏం జరుగుతుంతో తెలుసా?
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
వర్షంలో మొబైల్ ఫోన్ తడిసిందా? వెంటనే ఇలా చేస్తే మీ ఫోన్‌ సేఫ్
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?