సాధువులపై దాడిని ఖండించిన ఆర్ఎస్ఎస్… నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌ మూక దాడిని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ఖండించింది. జూన అఖాడాకు చెందిన సాధువులపై పాల్‌ఘర్‌కు చెందిన ఓ గ్రామంలో వేల మంది ఒకేసారి దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. ఏమి చేయలేకపోయారు. దొంగలనే అనుమానంతో దాడికి పాల్పడ్డారని తొలుత పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే ఘటనకు సంబంధించిన వీడియోలు […]

సాధువులపై దాడిని ఖండించిన ఆర్ఎస్ఎస్... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

Edited By:

Updated on: Apr 21, 2020 | 6:36 PM

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పాల్‌ఘర్‌ మూక దాడిని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ఖండించింది. జూన అఖాడాకు చెందిన సాధువులపై పాల్‌ఘర్‌కు చెందిన ఓ గ్రామంలో వేల మంది ఒకేసారి దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు సాధువులతో పాటుగా డ్రైవర్‌ కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా.. ఏమి చేయలేకపోయారు. దొంగలనే అనుమానంతో దాడికి పాల్పడ్డారని తొలుత పోలీసులు చేతులు దులుపుకున్నారు. అయితే ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మహారాష్ట్ర ప్రభుత్వంలో చలనం మొదలైంది. వెంటనే సాధువులపై దాడికి పాల్పడ్డ అల్లరిమూకలను అరెస్ట్ చేశారు. మొత్తం 110 మందిని ఘటనకు బాధితులుగా చూపిస్తూ అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది మైనర్లు కూడా ఉన్నారు. వీరిని జూవైనల్‌కు తరలించారు. నిందితులందరికీ ఏప్రిల్ 30 వరకు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. కాగా.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది.

కాగా.. గుజరాత్‌లో సాధువుల గురువు పరమపదించడంతో అంతిమ సంస్కారాల కోసం వెళ్తుండగా.. పాల్‌ఘర్‌ సమీపంలోని గాడ్చిన్చెల్ గ్రామస్థులు సాధువులపై మూకదాడికి పాల్పడ్డారు.ఈ ఘటన ఏప్రిల్ 16 రాత్రి జరిగింది.