దేశంలో మళ్లీ తెరపైకి రిజర్వేషన్ల వివాదం

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2020 | 2:21 PM

దేశంలో రిజర్వేషన్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేసే అంశాన్ని మళ్లీ పరిశీలించాలని మహారాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టును కోరింది.

దేశంలో మళ్లీ తెరపైకి రిజర్వేషన్ల వివాదం
Follow us on

దేశంలో రిజర్వేషన్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేసే అంశాన్ని మళ్లీ పరిశీలించాలని మహారాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టును కోరింది. మహారాష్ట్రలో 80 శాతం వెనుకబడినవర్గాల వారు ఉన్నారని గుర్తు చేశారు.

ఇంద్ర సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1992 లో ఇచ్చిన తీర్పు ప్రకారం దేశంలో 50% రిజర్వేషన్లు మించరాదు. అయితే ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారి కోసం 10 శాతం రిజర్వేషన్‌ కేటాయించాక రిజర్వేషన్ల శాతం 28 రాష్ట్రాల్లో 50 శాతాన్ని దాటిపోయాయని తెలిపారు. మహారాష్ట్రలో మరాఠా వర్గాల వారికి ఉద్యోగాలల్లో 12 శాతం కోటా కేటాయించారు. దీంతో రిజర్వేషన్ల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లపై కూడా ఇటీవల సుప్రీంకోర్ట్‌లో పిటిషన్‌ దాఖలైంది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను తెట్టెను మరోసారి కదిపింది. దీంతో 11 జడ్జిలతో కూడిన బెంచ్‌ దీనిపై ఎలాంటి తీర్పు ఇస్తుందోననే అంశంపై ఉత్కంఠ రేపుతోంది.