టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాధ్ సోదరుడు ఉమా శంకర్‌కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తూ నర్సీపట్నం టికెట్‌ను ఉమా శంకర్‌కు కేటాయించారు. పూరీకి సాయిరామ్ శంకర్, ఉమా శంకర్ అనే సోదరులు ఉన్నారు. సాయిరామ్ తన అన్నతో పాటు సినీ ఇండస్ట్రీలో ఉండగా.. ఉమా శంకర్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
గత కొంతకాలంలో వైసీపీలో ఉమా శంకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీంతో తాజాగా ఆయనకు వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ వరించింది. సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపింస్తున్నాయి. కాగా పూరీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో పూరీ తల్లి సత్యవతి సర్పంచ్‌గా పోటీ చేశారు. మరోవైపు వైసీపీలో సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి, జయసుధ, కృష్ణుడు, 30 ఇయర్స్ పృథ్వీ లాంటి తారలు వైసీపీలో ఉండగా.. సోమవారం అలీ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.