అలర్ట్…ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం..

|

Jun 10, 2020 | 6:43 PM

ఏపీలో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. మరో 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే పలు జిల్లాల్లో పిడుగులు పడవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరించారు. విజయనగరం , విశాఖ , తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. సురక్షితమైన ప్రదేశంలో ఆశ్రయం పొందాలని అన్నారు. […]

అలర్ట్...ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం..
Follow us on

ఏపీలో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. మరో 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే పలు జిల్లాల్లో పిడుగులు పడవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరించారు. విజయనగరం , విశాఖ , తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశముందని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు. సురక్షితమైన ప్రదేశంలో ఆశ్రయం పొందాలని అన్నారు.

విజయనగరం జిల్లాలోని పాచిపెంట, సాలూరు, కురుపాం, పార్వతీపురం, కొమరాడ, మెరకముడిదాం, దత్తిరాజేరు,రామభద్రపురం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. విశాఖ జిల్లా హుకుంపేట, అరకులోయ, అనంతగిరి, పాడేరు, మాడుగుల, చీడికాడ, రావికమతం, రోలుగుంట,చింతపల్లి, జి.మాడుగుల, గోలుగొండ, కొయ్యూరు, జీకే.వీధి, పెద్దబయలు,నాతవరం, నర్సీపట్నంలోకూడా పిడుగులు పడేందుకు అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని అడ్డతీగల, మారేడుమిల్లి, వైరామవరం, కోటనండూరు, రామచంద్రాపురం, దేవిపట్నం, గోకవరం, సీతానగరం,రంగంపేట,గండేపల్లి భారీ వర్షంతోపాటు ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరించారు.