Breaking News వదంతులు రేేపితే అణిచేస్తాం.. పది మంది అరెస్ట్

కరోనా భయం ప్రజలను ముంచెత్తిన నేపథ్యంలో తప్పుడు ప్రచారాలతో జనంలో మరింత ఆందోళన రేకెత్తిస్తున్న వారిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

Breaking News వదంతులు రేేపితే అణిచేస్తాం.. పది మంది అరెస్ట్

Edited By:

Updated on: Mar 30, 2020 | 3:55 PM

Ten persons arrested in Hyderabad for fake propaganda: కరోనా భయం ప్రజలను ముంచెత్తిన నేపథ్యంలో తప్పుడు ప్రచారాలతో జనంలో మరింత ఆందోళన రేకెత్తిస్తున్న వారిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని చేపట్టే వారు జాగ్రత్తగా వుండాలంటూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిన 24 గంటల్లోనే ఏకంగా పది కేసులు నమోదయ్యాయి.

కరోనాఫై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు మొదలయ్యాయి. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో 10 కేసులు నమోదు అయ్యాయి. వివిధ రకాలుగా సోషల్ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం జరుగుతోందని గుర్తించారు పోలీసులు. ముఖ్యంగా మద్యం షాపులు తెరుస్తారంటూ ప్రచారం చేసిన యువకులపై కేసులు నమోదయ్యాయి. ప్రముఖ ఆసుపత్రులు, జర్నలిస్టుల పేరుతో కరోనాపై అసత్య ప్రచారాలు జరిగాయి.

తెలంగాణకు ఆర్మీ వచ్చిందంటూ కొందరు యువకులు ప్రచారం చేశారు. కరోనా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారంటూ కొందరు ప్రచారం చేశారు. ఈ అసత్య ప్రచారాలపై 10 కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. అసత్య ప్రచారాలను, వదంతులను వ్యాప్తి చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. హెచ్చరికలకు అనుగుణంగా కఠిన చర్యలకు ఉపక్రమించారు.