వారణాసిలో 26న ప్రధాని మోదీ నామినేషన్‌

| Edited By:

Apr 10, 2019 | 5:25 PM

న్యూఢిల్లీ : ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మోదీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు మోదీ తన సొంత రాష్ట్రంలోని వడోదర నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే వడొదర నుంచి తప్పుకున్న మోదీ.. వారణాసి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ […]

వారణాసిలో 26న ప్రధాని మోదీ నామినేషన్‌
Follow us on

న్యూఢిల్లీ : ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మోదీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. 2014 సాధారణ ఎన్నికల్లో వారణాసితో పాటు మోదీ తన సొంత రాష్ట్రంలోని వడోదర నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే వడొదర నుంచి తప్పుకున్న మోదీ.. వారణాసి నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. నాటి ఎన్నికల్లో వారణాసి స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ పై మూడు లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో నరేంద్ర మోదీ ఘన విజయం సాధించారు. అటు వడోదర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి మధుసూద పై కూడా భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈ సారి మాత్రం కేవలం వారణాసి నుంచి మాత్రమే పోటీ చేస్తున్నారు.