అభినందన్‌ను విడుదల చేయొద్దంటూ పిటిషన్

|

Mar 01, 2019 | 6:10 PM

లాహోర్: భారత ఫైటర్ పైలట్ అభినందన్‌ను విడుదల చేయొద్దంటూ పాకిస్థాన్‌లో పలు పిటిషన్లు కోర్టులకు అందాయి. అభినందన్‌ను విడుదల భారత్‌కు అప్పగిస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అలా చేయోద్దని డిమాండ్ చేస్తూ లాహోర్ హైకోర్టు‌తో పాటు పలువురు పాకిస్థానీలు పిటిషన్లు వేశారు. కానీ లోహోర్ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. అసలు ఈ పిటిషన్‌కు అర్ధం లేదని చెప్పింది. విచారణ అర్హత లేదని అభిప్రాయపడింది. దీంతో అభినందన్‌ విడుదలకు అడ్డుపడాలని చూసిన […]

అభినందన్‌ను విడుదల చేయొద్దంటూ పిటిషన్
Follow us on

లాహోర్: భారత ఫైటర్ పైలట్ అభినందన్‌ను విడుదల చేయొద్దంటూ పాకిస్థాన్‌లో పలు పిటిషన్లు కోర్టులకు అందాయి. అభినందన్‌ను విడుదల భారత్‌కు అప్పగిస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అలా చేయోద్దని డిమాండ్ చేస్తూ లాహోర్ హైకోర్టు‌తో పాటు పలువురు పాకిస్థానీలు పిటిషన్లు వేశారు. కానీ లోహోర్ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

అసలు ఈ పిటిషన్‌కు అర్ధం లేదని చెప్పింది. విచారణ అర్హత లేదని అభిప్రాయపడింది. దీంతో అభినందన్‌ విడుదలకు అడ్డుపడాలని చూసిన కొందరి ప్రయత్నం విఫలమైంది. అంతర్జాతీయంగా భారత్ తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గిన పాక్ అభినందన్‌ను జెనీవా ఒప్పందం ప్రకారం భారత్‌కు అప్పగించబోతోంది. శుక్రవారం సాయిత్రం 4 గంటలకు భారత్‌కు అప్పగించనుంది.