Petition filed against Chandrababu on State capital issue: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మెడకు మరో కేసు బిగుసుకుంది. అయితే ఈసారి ఆయన జమానాలో జరిగిన తంతు గురించో.. లేక ఆయన ఆస్తుల గురించో కాదు.. ఏపీ క్యాపిటల్ విషయంలో నిబంధనలకు, ఆదేశాలు, చట్టాలను కాదని తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ చంద్రబాబుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయ్యింది.
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ క్యాపిటల్‌ని ఎక్కడ పెట్టాలనే విషయంలో చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారన్నది ఈ పిటిషన్ సారాంశం. ఏపీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అనిల్ కుమార్ బోరుగడ్డ ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
చంద్రబాబు గతంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలను, రాజధాని ఏర్పాటుపై నియమించిన శివ రామ కృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి సొంత లాభం కోసం రాజధాని ని విజయవాడ, గుంటూరుకు రాజధానిని తరలించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రోహింగ్టన్ నారిమాన్, జస్టిస్ రవీంద్ర భట్ విచారణకు స్వీకరించారు.
పిటిషనర్ తరపు న్యాయవాది ప్రజెంటేషన్ ఆసాంతం విన్న సుప్రీం న్యాయమూర్తులిద్దరు.. ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఈ మేరకు హైకోర్టుకు కేసును డైరెక్టు చేశారు.
Read this: Chandrababu focused on two assembly constituencies. Why? రెండు నియోజకవర్గాలపై బాబు నజర్