చెట్లపై చెయ్యేస్తే.. ఇక జైలుకే

|

Feb 18, 2019 | 10:59 AM

అడవులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటి వరకు అడవుల్లోని చెట్లను నరికితే కఠినమైన శిక్షలు లేకపోవడంతో దుండగులు యథేచ్ఛగా కలప స్మగ్లింగ్ కు పాల్పడి విలువైన సంపదను కొల్లగొట్టారు. ఇకపై కలప స్మగ్లింగ్ కు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్తచట్టానికి రూపకల్పన చేశారు. గతంలో కలప స్మగ్లింగ్ కు పాల్పడినా, విలువైన సంపదను కొల్లగొట్టినా, అటవీ భూమి కబ్జాచేసినా గరిష్ఠంగా ఒకరోజు నుంచి ఏడాది వరకు జైలుశిక్ష విధించేలా చట్టాలు ఉండేవి. జరిమానా కూడా […]

చెట్లపై చెయ్యేస్తే.. ఇక జైలుకే
Follow us on

అడవులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటి వరకు అడవుల్లోని చెట్లను నరికితే కఠినమైన శిక్షలు లేకపోవడంతో దుండగులు యథేచ్ఛగా కలప స్మగ్లింగ్ కు పాల్పడి విలువైన సంపదను కొల్లగొట్టారు. ఇకపై కలప స్మగ్లింగ్ కు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్తచట్టానికి రూపకల్పన చేశారు. గతంలో కలప స్మగ్లింగ్ కు పాల్పడినా, విలువైన సంపదను కొల్లగొట్టినా, అటవీ భూమి కబ్జాచేసినా గరిష్ఠంగా ఒకరోజు నుంచి ఏడాది వరకు జైలుశిక్ష విధించేలా చట్టాలు ఉండేవి. జరిమానా కూడా రూ.10 నుంచి రూ.2వేల వరకే ఉండేది. ఇకపై కొత్తచట్టం రూపకల్పనతో నేరం చేసేవారిని కఠినంగా శిక్షించనున్నారు. ఏ కేసునైనా నాన్ బెయిల్ సెక్షన్ కింద నమోదు చేసి జైలుకు పంపేలా సెక్షన్లను మార్చారు. జరిమానా కూడా పెద్దమొత్తంలో పెంచుతున్నారు. కనీసం జైలుశిక్ష 3 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు ఉండేలా చట్టానికి పదునుపెడుతున్నారు. షెడ్యూల్-3లో చేర్చిన టేకు, నల్లమద్ది, ఏగిస, చందనం వంటి చెట్లను నరికితే కనీసం మూడేళ్ల నుంచి 14ఏళ్ల వరకు శిక్ష పడనుంది.

నేరస్థులను అరెస్ట్ చేసి అక్రమ సంపదను సీజ్ చేసే అధికారం పోలీసులతో పాటు అటవీ అధికారులకు ఉన్నది. అయితే నేరస్థులను ప్రాసిక్యూట్ చేసే అధికారం లేకపోవడంతో ఇబ్బందిగా పరిణమించడంతో.. కొత్త చట్టంలో ఆ అధికారాన్ని అటవీ అధికారులకు ఇవ్వాలని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీలైతే ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.