హైదరాబాద్: వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు మాగుంట శ్రీనువాసుల రెడ్డి, కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక వైసీపీలో చేరారు. బుట్టా రేణుక గత ఏడాది వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కర్నూలు ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించిన బుట్టాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తిరిగి ఆమె వైసీపీలో చేరారు.
బీసీ మహిళగా తనకు టీడీపీలో అవమానాలు జరిగాయని ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా తిరిగి వైసీపీలో చేరినట్లు చెప్పారు. ప్రకాశం, నెల్లూరులో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి, త్వరలోనే తాను ఎన్నికల ప్రచారం మొదలు పెడతానని వివరించారు.
నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు కొన్ని రోజుల ముందట నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ పొందారు. టీడీపీ తరుపున ప్రచారం కూడా నిర్వహించారు. నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఆయన వైసీపీలోకి జంప్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సీనియర్ నేత వంగా గీత కూడా వైసీపీలో చేరారు. పిఠాపురం లేదా కాకినాడ ఎంపీగా ఆమె పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహిళా నేతల త్రిపురాన వెంకటరత్నం, తాడి శకుంతల కూడా వైసీపీలో చేరారు.