
పాకిస్థాన్‌లో మైనార్టీలకు చెందిన అమ్మాయిల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే వేలమంది మైనార్టీ అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. ఆపై బలవంతంగా వారిని ఇస్లాం మతంలోకి మార్చేస్తున్నారు. అంతేకాదు ఆ అమ్మాయిలకు ముస్లిం యువకులను లేదా.. ముస్లిం పురుషులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లో పద్నాలుగేళ్ల మైనర్ హిందూ అమ్మాయిని కిడ్నాప్ చేసి మతం మార్చారు. అంతేకాదు ఆ అమ్మాయిని 40 ఏళ్ల మహ్మద్ ఆచార్ అనే వ్యక్తి వివాహమాడాడు. దీనికి సంబంధించిన ఫోటోలు పాక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
మహ్మద్ ఆచార్ అనే వ్యక్తి.. సదరు మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి మతం మార్చినట్లు తెలుస్తోంది. బాధితురాలి చేతితో నిఖాకు సంబంధించిన పేపర్లతో అతను ఫోటో కూడా దిగాడు. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పాక్ మైనార్టీ సంఘాలు మండిపడుతున్నాయి. మైనార్టీ యువతులపై దాడులను ఆపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా.. హిందువులు ఎక్కువగా ఉండే ఈ సింధ్ ప్రాంతంలో నిత్యం అమ్మాయిల కిడ్నాప్ జరగడం కామన్‌గా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు వేల మంది హిందూ, క్రిస్టియన్, సిక్కు యువతులను కిడ్నాప్ చేసి ఇస్లాంలోకి మార్చి వివాహాలు చేసుకుంటున్నారు.