వైద్య సిబ్బందిపై దాడి.. ఆర్డినెన్స్ వచ్చిన మర్నాడే అటాక్

కరోనా బారి నుంచి ప్రజల్ని రక్షించేందుకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పని చేస్తున్న వైద్య సిబ్బందిపై మరో దాడి జరిగింది. అది కూడా డాక్టర్లపై దాడి చేస్తే కఠిన శిక్షలంటూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన 24 గంటల్లోనే ఈ దాడి ఏకంగా దేశ రాజధానిలోనే జరిగింది.

వైద్య సిబ్బందిపై దాడి.. ఆర్డినెన్స్ వచ్చిన మర్నాడే అటాక్

Updated on: Apr 23, 2020 | 3:18 PM

కరోనా బారి నుంచి ప్రజల్ని రక్షించేందుకు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పని చేస్తున్న వైద్య సిబ్బందిపై మరో దాడి జరిగింది. అది కూడా డాక్టర్లపై దాడి చేస్తే కఠిన శిక్షలంటూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన 24 గంటల్లోనే ఈ దాడి ఏకంగా దేశ రాజధానిలోనే జరిగింది. ఒక ఫ్యామిలీ వాదందరికీ ఒకే చోట పెట్టి చికిత్స నందించాలన్న మూర్ఖపు డిమాండ్‌తో ఓ కుటుంబం వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడింది.

ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పటల్‌లో వైద్య సిబ్బందిపై దాడి జరిగింది. వైద్యులపై దాడులు నివారించేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిన 24 గంటలలోపే వైద్య సిబ్బందిపై దాడికి తెగబడింది ఓ మూర్ఖపు కుటుంబం. బుధవారం రాత్రి పది-పదకొండు గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం.

బుధవారం రాత్రి 10 మంది హాస్పటల్‌ కు చేరుకున్న ఓ కుటుంబం తమందరిని ఒకే చోట ఉంచి, చికిత్స చేయాలంటూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి పరిస్థితి, గదుల లభ్యత, ఇతర సౌకర్యాల దృష్ట్యా అది కుదరదని చెప్పిన వైద్య సిబ్బందిపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు.

ఈ కుటుంబంలో 10 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రైవేట్ ల్యాబులో పరీక్షలు చేయించుకుని పాజిటివ్‌గా తేలడంతో చికిత్స కోసం బుధవారం రాత్రి హాస్పటల్‌కు చేరుకున్నది ఈ కుటుంబం. తామందరినీ ఒకే చోట పెట్టి చికిత్స నిందివాలని వైద్య బృందాన్ని డిమాండ్ చేసింది. కుదరదని నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. జరిగిన ఘటన పట్ల విచారణపై ఆదేశించింది ఢిల్లీ ప్రభుత్వం. వైద్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.