దేశ రాజధానిలో ఎన్నారై అనుమానాస్పద మృతి

| Edited By:

Jul 22, 2019 | 4:18 PM

దేశ రాజధాని ఢిల్లీలో ప్రవాస భారతీయ వ్యాపారవేత్త అనుమానస్పద స్థితితో మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్నీ జైట్లీ( 35) అనే భారతీయ వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడ్డాడు. తన బిజినెస్ వ్యవహారాల నిమిత్తం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అయితే శుక్రవారం తన తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా జైట్లీ ఫోన్ రిసీవ్ […]

దేశ రాజధానిలో ఎన్నారై అనుమానాస్పద మృతి
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో ప్రవాస భారతీయ వ్యాపారవేత్త అనుమానస్పద స్థితితో మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్నీ జైట్లీ( 35) అనే భారతీయ వ్యాపారవేత్త తన కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడ్డాడు. తన బిజినెస్ వ్యవహారాల నిమిత్తం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. అయితే శుక్రవారం తన తండ్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా జైట్లీ ఫోన్ రిసీవ్ చేసుకోకపోవడంతో హోటల్ సిబ్బందికి ఫోన్ చేశాడు. తన కొడుకుతో మాట్లాడాలని చెప్పాడు. ల్యాండ్‌లైన్ కలిపినా సరే జైట్లీ ఫోన్ ఎంతకీ తీయకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి చూసే సరికి జైట్లీ అచేతన స్థితిలో కనిపించాడు. వెంటనే వైద్య చికిత్స నిమిత్తం దగ్గర్లోని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మ‌ృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

మున్నీజైట్లీ మ‌ృతిపై ప్రస్తుతం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే తమ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సాధారణ మరణంగానే భావిస్తున్నామని, అయితే కారణాలు ఇప్పుడే వివరించలేమంటున్నారు. హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.