నార్త్ కొరియా అధినేత కిమ్ ఆరోగ్యం విషమం ?

| Edited By: Anil kumar poka

Apr 21, 2020 | 12:42 PM

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్  ఆరోగ్యం విషమ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు కార్డియో వాస్క్యులర్ సర్జరీ జరిగిందని, అనంతరం ఆయన హెల్త్ ఆందోళనకరంగా మారిందని నార్త్ కొరియాలోని ఒక వ్యక్తి తెలిపినట్టు అక్కడి స్థానిక డైలీ వెల్లడించింది.

నార్త్ కొరియా అధినేత కిమ్ ఆరోగ్యం విషమం ?
Follow us on

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్  ఆరోగ్యం విషమ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు కార్డియో వాస్క్యులర్ సర్జరీ జరిగిందని, అనంతరం ఆయన హెల్త్ ఆందోళనకరంగా మారిందని నార్త్ కొరియాలోని ఒక వ్యక్తి తెలిపినట్టు అక్కడి స్థానిక డైలీ వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికాలోని ఓ వ్యక్తి కూడా పేర్కొన్నాడు. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం బయటి ప్రపంచానికి తెలియడం లేదు. కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్టును ఇప్పుడే వెరిఫై చేయలేమని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 15 న జరిగిన తన తాత పుట్టినరోజు కార్యక్రమానికి కూడా కిమ్ గైర్ హాజరయ్యాడు. అలాగే ప్రభుత్వ సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. ఈ ఏడాది కేవలం 17 సార్లు మాత్రమే పబ్లిక్ ఫంక్షన్లకు హాజరయ్యాడు. ఇలా ఉండగా ఉత్తర కొరియా పరిణామాలను అమెరికా జాగ్రత్తగా గమనిస్తోంది. కిమ్ లేనప్పుడు ఆయన సోదరే ప్రభుత్వ కారక్రమాలల్లో పాల్గొనడం చూస్తే.. ఇక నార్త్ కొరియా రాజకీయాల్లో ఆమె ప్రముఖ పాత్ర వహించే సూచనలు ఉన్నాయని అంటున్నారు.

అవన్నీ ఊహాగానాలే !

అటు-కిమ్ ఆరోగ్యంపై వఛ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని  ఉత్తర కొరియా ప్రభుత్వం కొట్టి పారేసింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన హెల్త్ కి సంబంధించి వస్తున్న వదంతులను నమ్మరాదని పేర్కొంది. నాలుగు రోజుల క్రితం కూడా కిమ్ ఓ ప్రభుత్వ సంబంధ కార్యక్రమంలో పాల్గొన్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా కిమ్ ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచుతున్నారు. మరోవైపు- ఆయన కోలుకుంటున్నారని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని సైతం వార్తలు అందుతున్నాయి.

కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ కి ప్రభుత్వ పగ్గాలు ?

కిమ్ వారసురాలిగా ఆయన సోదరి కిమ్ యో జాంగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో తన సోదరునికి ఎల్లవేళలా అండగా ఉంటూ అవసరమైనప్పుడు ఆయనకు సలహాలిస్తూ రాజకీయాల్లో పరోక్షంగా తానే ‘పెద్ద దిక్కు’ గా ఉంటూ వఛ్చిన జాంగ్…. టాప్ లీడర్ షిప్ పొజిషన్ ని కైవసం చేసుకోవచ్ఛునని భావిస్తున్నారు. ఆమె తన సోదరునికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ఇదివరకే వార్తలు వచ్చాయి. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి, కిమ్ కి మధ్య జరిగిన చర్చలు విఫలమైన అనంతరం ఆమె ప్రధాన ప్రచార విభాగం అధినేతగా బాధ్యతలు చేపట్టింది. నార్త్ కొరియాలో కరోనా కేసులు లేనప్పటికీ సామాజిక దూరాన్ని పాటించవలసిందిగా కిమ్ కు డాక్టర్లు సలహా ఇచ్చారని, ఇందుకు జాంగ్ కూడా వారిని సమర్థించిందని అంటున్నారు.