ఒడిషా : ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం, పెరగడం సహజం. కానీ ఓటర్లు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండటం మాత్రం నిజంగా పెద్ద విషయమే అని చెప్పాలి. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా పరిధిలోని 6 పోలింగ్ బూత్‌లలో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మల్కాన్ గిరి జిల్లాలోని చిత్రకొండ, మతిలి పరిధిలోని 6 బూత్‌లలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ప్రజలు నిర్ణయించుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. కొద్ది రోజుల క్రితం నుంచి ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం కూడా ఓటర్లపై ప్రభావం చూపిందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కలహంది ప్రాంతానికి చెందిన ఓటర్లు తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదనే కారణంగా ఎన్నికలను బహిష్కరించారు.