370, 35A ఆర్టికల్స్‌ మా హక్కులు: ఫరూక్ అబ్దుల్లా

జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను సాధించిపెడుతున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35-A ను ప్రధాని నరేంద్ర మోదీ తొలగించలేరని ఆ రాష్ట్ర నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కాగా రెండు ఆర్టికల్స్ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుతున్నాయని అన్నారు. ఇవి మాకు చాల ముఖ్యమని, జమ్ము కశ్మీరీలు దేశానికి సైనికుల్లాంటీ వారని… శత్రువులు కాదని అన్నారు కాగా ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ప్రజలను విడదీయాడానికి బదులుగా ఐక్యంగా ఉంచడానికి కృషి […]

370, 35A ఆర్టికల్స్‌ మా హక్కులు: ఫరూక్ అబ్దుల్లా

Edited By:

Updated on: May 25, 2019 | 2:58 PM

జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను సాధించిపెడుతున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35-A ను ప్రధాని నరేంద్ర మోదీ తొలగించలేరని ఆ రాష్ట్ర నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కాగా రెండు ఆర్టికల్స్ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడుతున్నాయని అన్నారు. ఇవి మాకు చాల ముఖ్యమని, జమ్ము కశ్మీరీలు దేశానికి సైనికుల్లాంటీ వారని… శత్రువులు కాదని అన్నారు

కాగా ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని ప్రజలను విడదీయాడానికి బదులుగా ఐక్యంగా ఉంచడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ శక్తివంతుడని బావిస్తున్నాడని ఆయన్ను అలాగే ఉండనిద్దామని ఆయన పేర్కోన్నారు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్‌లో ఉన్న మొత్తం ఆరు స్థానాల్లో బీజేపీ మూడు స్ధానాల్లో విజయం సాధించగా… మరో మూడు స్దానాలను నేషనల్ కాన్ఫరెన్స్ కైవసం చేసుకుంది.

పాకిస్థాన్ పక్కనే కశ్మీర్ ఉండడంతో, ఉగ్రవాదులు స్థానికుల సహకారంతో చొరబాటు చేసి వింధ్వంసానికి పాల్పడుతుండడంతో దేశానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దీంతో కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు ఇస్తున్న 370 ఆర్టికల్ ను తొలగిస్తామని బీజేపీ ప్రచారం చేస్తోంది. భారీ మెజారీటీతో గెలిచిన మోదీ ఎలాంటీ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.