
ముంబైలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో పని చేసే 26 మంది నర్సులకు, ముగ్గురు డాక్టర్లకు కూడా కరోనా పాజిటివ్ సోకింది.. వొకార్డ్ ఆసుపత్రిగా వ్యవహరించే ఈ వైద్య శాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించి మొత్తం ఆసుపత్రినంతా శానిటైజ్ చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ఉన్న రోగులకు జరిపే టెస్టుల్లో నెగెటివ్ అని తేలేంతవరకు ఎవరినీ ఇందులోకి అనుమతించడం లేదు. . అలాగే ఆసుపత్రి నుంచి ఎవరూ బయటకి వెళ్ళడానికి వీల్లేదని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ వైద్యశాలలో 270 మందికి పైగా రోగులను, నర్సులను, ఇతర వైద్య సిబ్బందిని కరోనా టెస్టులు చేస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉన్న రోడ్డులోని ఈ ఆసుపత్రిలోనే కరోనా తిష్ట వేయడంతో చుట్టుపక్కల ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు.